India vs Australia : Rishabh Pant Is a Game Changer, Instead of Dhoni Pant Should Play | Oneindia

2019-01-05 747

Former Indian captain Sourav Ganguly has called for the inclusion of Rishabh Pant in India's ODI squad for the forthcoming matches against Australia and New Zealand. Not Ambati Rayudu, Ganguly reckons that Pant should bat at No.4 for he is a 'game changer' and none have the calibre otherwise.
#IndiavsAustralia4thTest
#AusvInd
#SouravGanguly
#RishabhPant
#gamechanger

ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో రిషబ్ పంత్‌ను నెం.4 స్థానంలో ఆడించాలని డిమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ డిమాండ్ చేశాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో రిషబ్ పంత్ (159 నాటౌట్) అద్భుత సెంచరీతో సరికొత్త రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీంతో టెస్టులతో పాటు వన్డే, టీ20ల్లోనూ రిషబ్ పంత్‌కి ఇకపై సెలక్టర్లు అవకాశమివ్వాలని సౌరవ్ గంగూలీ సూచించాడు. తాజాగా గంగూలీ మాట్లాడుతూ "రిషబ్ పంత్ అద్భుతమైన ఆటగాడు. అతను అలవోకగా మ్యాచ్‌ని భారత్‌వైపు తిప్పలగలడు. అందుకే ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్‌లో నెం.4 స్థానంలో అతడ్ని ఆడించాలని సెలక్టర్లకి సూచిస్తున్నా" అని అన్నాడు. ఫాస్ట్ బౌలర్లని సమర్థంగా ఎదుర్కొంటూ అతను బౌండరీలు సాధిస్తున్న తీరు అమోఘం. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ టాప్-3లో ఆడుతూ మ్యాచ్‌ల్ని గెలిపిస్తున్నారు. వారికి తోడుగా, నెం.4 స్థానంలో రిషబ్ పంత్‌ని ఆడిస్తే? భారత్‌కి తిరుగుండదు. రిషబ్ పంత్‌లా ఆ స్థానంలో ఆడగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు ఇప్పుడు టీమ్‌లో ఎవరూ లేరు" అని గంగూలీ అన్నాడు.